తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఉన్న లెప్రసీ హాస్పిటల్ వెనుక ముళ్ల పొదల్లో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అలిపిరి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గాప్రసాద్ వెల్లడించారు.