తిరుమలలో భక్తుల భద్రత, క్షేత్ర పవిత్రతను పరిరక్షించేందుకు పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. అలిపిరి నడక మార్గంలో 62 దుకాణాలను తనిఖీ చేసి, గుర్తింపు పత్రాలు లేని 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లైసెన్సులు లేని 8 షాపులను గుర్తించారు. 34మంది వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించారు. గడువు ముగిసిన శీతల పానీయాలు విక్రయిస్తున్న మూడు దుకాణాలపై ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల భద్రతకు విఘాతం కలిగించే అంశాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.