తిరుపతిలో తొమ్మిదో తరగతి చదువుతున్న స్వీటీ కుమారి (16) అనే విద్యార్థిని ఇంటి మిద్దెపై నుంచి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గాజుల వీధికి చెందిన బాలిక 29వ తేదీన రాత్రి నిద్రకు వెళ్లి కనిపించకుండా పోయింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, బాలిక తండ్రి మనోజ్ ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.