తిరుపతి మురికి కాలువలో యువకుడి శవం.. కారణం ఇదేనా..?

0చూసినవారు
తిరుపతిలో మంగళవారం STV నగర్‌కు చెందిన దివాకర్ అనే యువకుడు మురికి కాలువలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి స్నేహితులతో మద్యం సేవించిన దివాకర్, ఇంటికి వెళ్లి భార్యతో డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. అనంతరం కాలువ వద్ద మూత్ర విసర్జనకు వెళ్లి జారి పడ్డాడా లేక మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్