జీవో 77రద్దు చేసి అర్హులైనవారందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కోరారు. ఆదివారం తిరుపతిలోని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్తుకు అనుకూలంగా నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు.