తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. సత్యవేడు మండలంలోని శ్రీసిటీలో జరిగిన ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్, తమిళనాడుకు చెందిన రమేష్, మోహన్, బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్, తడకు చెందిన వాసు ఉన్నారు.