దొంగను పట్టించిన చెప్పులు: చోరీ కేసులో కీలక ఆధారం

394చూసినవారు
దొంగను పట్టించిన చెప్పులు: చోరీ కేసులో కీలక ఆధారం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నెముట్టూరు గ్రామంలో రెండు నెలల క్రితం చర్చి ఫాదర్ ఇంట్లో జరిగిన రూ.2 లక్షల నగదు, రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగలు వదిలి వెళ్లిన చెప్పులే కీలక ఆధారంగా మారాయి. ఈ చెప్పుల ఆధారంగా పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామానికి తరచూ వచ్చి వెళ్లే పాకం మనోజ్, తోప్పాని ఈశ్వర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని డీఎస్పీ చెంచు బాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్