తిరుపతి నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా వాతావరణం మారింది. ఉదయం ఎండలు తీవ్రంగా ఉండగా, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు కూడా వీచాయి. ఎండల వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించినా, తీవ్రమైన ఉరుములు, మెరుపుల కారణంగా పిడుగుల భయంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.