తాళం వేసిన ఇంటిలో చోరీ

3చూసినవారు
తాళం వేసిన ఇంటిలో చోరీ
తిరుపతి రూరల్ మండలం ఎస్వీయూ నాన్ టీచింగ్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం ఊరికి వెళ్లిన సమయంలో, దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. పై అంతస్తులో ఉన్న యజమాని విశ్వనాథన్ సీసీ కెమెరాల్లో గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు తిరిగి వచ్చాక, ఇంట్లోంచి సుమారు రూ.20 వేల నగదు, 150 గ్రాముల వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్