స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు CCTNS డేటా ఎంట్రీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డేటాను ఖచ్చితంగా, సమయానికి నమోదు చేయాలని ఆదేశించిన ఆయన, నిర్లక్ష్యం వల్ల జిల్లా ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన స్టేషన్లలో సీసీఎస్ తిరుపతి మొదటి స్థానం, తిరుమల వన్ టౌన్ రెండో స్థానం, మహిళా పోలీస్ స్టేషన్ మూడో స్థానంలో నిలిచాయి.