తిరుమల టూ టౌన్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాకు చెందిన బాలకృష్ణ (రమేశ్) మరియు హనుమకొండ జిల్లాకు చెందిన నవీన్ (32)గా వీరిని గుర్తించారు. వీరి నుంచి రూ.45వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. ఈ దొంగలు తిరుమలలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.