తిరుమలలో భార్యాభర్తను అలా కలిపారు..!

977చూసినవారు
తిరుమలలో భార్యాభర్తను అలా కలిపారు..!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జియో ట్యాగ్ విధానం అమలు చేశారు. దీని సాయంతో పోలీసులు తప్పిపోయిన దంపతులను సురక్షితంగా కలిపారు. యానాం ఏరియాకు చెందిన వెంకట నాగరత్న మణి, కె.సుబ్రహ్మణ్యం దంపతులు అలిపిరి వద్ద వేర్వేరు బస్సులు ఎక్కడంతో విడిపోయారు. మొబైల్ ఫోన్లు లేక భయాందోళనకు గురైన నాగరత్నమ్మ చైల్డ్ ట్యాగ్ సిబ్బందిని ఆశ్రయించగా, వారి కుమారుడి సహాయంతో భర్త ఆచూకీ గుర్తించి కలిపారు. ఈ సంఘటన జియో ట్యాగ్ విధానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

సంబంధిత పోస్ట్