తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు ముందుగా నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న అంకురార్పణ జరుగుతుంది. 17న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలై, 25న పంచమీతీర్థం, ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముఖ్యంగా 22న స్వర్ణరథం, గరుడ వాహన సేవ, 24న రథోత్సవం, అశ్వవాహనం వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.