తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి గరుడ వాహన సేవ నేపథ్యంలో కొండపైకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతున్నాయి. శనివారం 75,006 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 45,413 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.