తిరుపతి జిల్లా వరదయ్య పాలెం (m)లో బుధవారం ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మేకల కాపరి వెంకటరమణయ్య (46) బాలిక (16)పై లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు శ్రీసిటీ డీఎస్పీ బీ.వీ శ్రీనివాసులు తెలిపారు. బాలికను పరీక్షల నిమిత్తం శ్రీసిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.