తిరుపతి: నడిరోడ్డుపై దాడి.. తీవ్రంగా గాయాలు

1219చూసినవారు
తిరుపతి భవానీనగర్ సర్కిల్‌లో జ్యూస్ షాపు నిర్వహిస్తున్న రవిపై ఓబులేశ్ అనే వ్యక్తి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది. వ్యక్తిగత పరిచయాలు, ఆర్థిక లావాదేవీల వివాదాలే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై ప్రసాద్ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన రవిని రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.