తిరుపతి: టీటీడీ భూముల విక్రయంపై భూమన తీవ్ర ఆరోపణలు

1251చూసినవారు
మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వెయ్యి కోట్ల విలువైన 22 ఎకరాల టీటీడీ భూమిని కేవలం రూ. 94 కోట్లకు విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. టూరిజం అభివృద్ధి పేరుతో భూములను పీపీపీ విధానంలో కాకుండా ఫ్రీహోల్డ్ పద్ధతిలో ఇవ్వడం అనుమానాస్పదమని ఆయన ప్రశ్నించారు. దివ్యశ్రీ డెవలపర్స్, సైబర్ సిటీ డెవలపర్స్ సంస్థలకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చి, పన్ను మినహాయింపులు కల్పించారని విమర్శించారు. ఈ భారీ అవినీతిలో మంత్రి లోకేశ్ హస్తం ఉందనే ప్రచారం జరుగుతోందని భూమన అన్నారు.