తిరుపతిలోని సత్యనారాయణపురంలో గురువారం రాత్రి బిర్యానీ డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. తిరుమల ఎస్పీఎఫ్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రాము, మద్యం మత్తులో కర్రీ సెంటర్‌కు వెళ్లి బిర్యానీ, చికెన్ కర్రీ పార్శిల్ తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపణలున్నాయి. దుకాణ నిర్వాహకులు డబ్బులు అడగడంతో వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.