తిరుపతి: శ్రీవాణి ట్రస్ట్ బుకింగ్ లో మార్పులు.. భక్తులకు ఊరట

1418చూసినవారు
తిరుపతి: శ్రీవాణి ట్రస్ట్ బుకింగ్ లో మార్పులు.. భక్తులకు ఊరట
టీటీడీ శ్రీవాణి ట్రస్టు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రూ. 10,000 విరాళం, రూ. 500 బ్రేక్ దర్శనం టికెట్ మొత్తాన్ని వేర్వేరుగా చెల్లించాల్సి ఉండగా, ఇకపై ఈ రెండు మొత్తాలను కలిపి రూ. 10,500ను ఒకేసారి ఆన్లైన్లో చెల్లించేలా సౌకర్యం కల్పించింది. ఈ మార్పుతో బుకింగ్ ప్రక్రియ సులభతరం కానుంది, భక్తులకు సమయం ఆదా అవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ బుకింగ్ కోసం ఎదురుచూసే భక్తులకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది.
Job Suitcase

Jobs near you