గురువారం అర్ధరాత్రి అనంతరం, మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు నగర శివారులోని తనపల్లి రఘనాథ రిసార్ట్స్ సమీపంలో సునందకుమార్ రెడ్డి ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. కిటికీ ఊచలను తొలగించి లోపలికి ప్రవేశించిన గ్యాంగ్ సభ్యులు విలువైన వస్తువుల కోసం వెతికారు. అయితే, ఇంటి యజమాని అప్రమత్తం కావడంతో చోరీ యత్నం విఫలమైంది. బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.