తిరుపతి: కీలక సూచనలు చేసిన కమిషనర్

477చూసినవారు
తిరుపతి: కీలక సూచనలు చేసిన కమిషనర్
మురుగునీటి కాలువల్లో చెత్త, వ్యర్థాలు వేయకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి ప్రజలకు సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా చెన్నారెడ్డి కాలనీ, అంబేడ్కర్ కాలనీ, ఎన్జఓ కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువల్లో చెత్త వేయడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you