తిరుపతి నగరం కేశవాయనగుంటలో శనివారం రాత్రి మందుబాబులు హల్ చల్ సృష్టించారు. నడిరోడ్డుపై మద్యం తాగుతూ కారు పక్కకు తీయమని కోరినందుకు, ఆసుపత్రి నుంచి వస్తున్న రోగి కుటుంబంపైకి కారును ఎక్కించారు. ఈ దాడిలో లవకుమార్, తేజస్వినిలకు గాయాలయ్యాయి. అడ్డువచ్చిన వారిని కత్తులతో బెదిరిస్తూ, బాధితుల కారును సినిమా తరహాలో వెంబడించారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగానే నిందితులు పరారయ్యారు.