శనివారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో లిఫ్ట్ ఆగిపోవడంతో హైదరాబాద్‌కు చెందిన రత్న కిశోర్ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. స్థానిక శిల్పారామం సమీపంలో బస చేసిన ఈ కుటుంబం తమ గదులకు వెళ్తుండగా లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. సుమారు అరగంట పాటు లిఫ్ట్‌లో చిక్కుకున్న బాధితులను హోటల్ సిబ్బంది అతికష్టంపై బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.