తిరుపతి: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

2చూసినవారు
తిరుపతి: వాహనం ఢీకొని వ్యక్తి మృతి
శుక్రవారం తెల్లవారుజామున స్థానిక సరోజనీదేవి రోడ్డులోని పాత ప్రసూతి ఆస్పత్రి కూడలిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో రుయా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. పోలీసులు మృతదేహాన్ని రుయాకు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్