తెలంగాణలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో మన్సూర్ దాబా వద్ద బెంగళూరు వైపు వెళ్తున్న రెండు ట్రావెల్ బస్సులు ఓవర్టేక్ చేస్తూ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో తిరుపతికి చెందిన అశోక్ రెడ్డి మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న DCRB DSP రమణ, రూరల్ సీఐ మహేశ్ బాధితులను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.