తిరుపతి: దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

467చూసినవారు
తిరుపతి: దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడుకు చెందిన సురేష్ (30) అనే వ్యక్తి వింటేజ్ హోటల్ వద్ద జరిగిన దాడిలో గాయపడి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత ఏడాది డిసెంబర్ 31న తిరుపతికి వచ్చిన సురేష్, ఈ నెల 7వ తేదీ సాయంత్రం అన్న క్యాంటీన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తితో గొడవ పడ్డాడు. రాయితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలైన సురేష్ ను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్