తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఆదివారం శ్రీసంజీవరాయ స్వామికి మగవారే పొంగళ్లు పెట్టి పూజలు చేయడం అనవాయితీ. ఆలయంలో ఆడవారికి ప్రవేశం లేదు. ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పెడతారు. దేశ విదేశాల్లో ఉన్న మగవాళ్లు సైతం ఇక్కడికి వచ్చి పొంగళ్లు పెట్టడం విశేషం.