తిరుపతిలోని ఓ బాలుర హాస్టల్లో ఇద్దరు నైట్ వాచ్ మెన్లు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న ఒక బాలుడు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో, వారు వెంటనే వార్డెన్కు సమాచారం అందించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, అలిపిరి పోలీసులు పోక్సో, SC, ST యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.