వెంకటగిరి-ఏర్పేడు హైవేపై శుక్రవారం ఉదయం నారాయణవనంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. వెంకటగిరి నుంచి విద్యార్థులతో బయల్దేరిన బస్సు ఆంజినేయపురం వద్దకు రాగానే డ్రైవర్ రాజుకు ఫిట్స్ రావడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌ను వెంకటగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.