తిరుపతి: సంతకం కార్యాలయంలో.. సేవలు సార్ ఇంట్లో

1చూసినవారు
తిరుపతి: సంతకం కార్యాలయంలో.. సేవలు సార్ ఇంట్లో
తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఒక డీజీఎం (డిప్యూటీ జనరల్ మేనేజరు) స్థాయి అధికారి, జీతం తీసుకుంటూ ఏడేళ్లుగా తన ఇంట్లోనే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని (అటెండరు) పనిచేయించుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. వైకాపా హయాంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో, నాటి మంత్రి అండదండలతో అధికారులు నియామకాలు చేపట్టారు. 2019లో ఉద్యోగంలో చేరిన ఈ మహిళ, కార్పొరేట్ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉండగా, అధికారి ఇంట్లోనే సేవలందిస్తోంది. కార్యాలయంలో సంతకం చేసిన కొద్దిసేపటికే ఇంటికి వెళ్లిపోవడం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు రూ.18-20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. కొందరు ఉన్నతస్థాయి అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తమ వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.