తిరుపతి: సర్వభూపాల వాహనంపై శ్రీమలయప్ప
By P. Parasuram 1053చూసినవారుతిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై శ్రీబకాసుర వధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల నడుమ, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సర్వభూపాల అంటే అందరు రాజులు, దిక్పాలకులు అని అర్థం.