తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో జనవరి 5వ తేదీ నుంచి జరగాల్సిన M.A, MSC, M.Com, M.S Data Science, M.Ed, M.Lisc రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరీక్షలు జనవరి 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. NET పరీక్షల నేపథ్యంలో PG సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని SFI నాయకులు రెక్టార్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.