తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం జంగాలపల్లికి చెందిన 54 ఏళ్ల బల్లి ప్రసాద్, ఉత్తర నెల్లూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్న ఆయన, ఆదివారం ఇంటి నుంచి వెళ్లి సాగరమాల సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్‌ఎం రిటైర్ అయిన తర్వాత పని ఒత్తిడి కారణంగానే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.