తిరుమల ప్రకృతి అందాలు మరోసారి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. పచ్చని చెట్లతో ఏడు కొండలు, మహాద్వారం, వెండి ద్వారం, బంగారు గోపురంతో శ్రీవారి ఆలయం రమణీయంగా కనిపిస్తోంది. ఆకాశం నుంచి చూస్తే మరింత అద్భుతంగా ఉన్న తిరుమల దృశ్యాన్ని రాత్రి వేళ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెలుగుల్లో మెరిసిపోతున్న శ్రీవారి క్షేత్రం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.