తిరుపతి: గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు

1192చూసినవారు
తిరుపతి: గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులను శనివారం సాయంత్రం తిరుమలకు సమర్పించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్. ఆర్. గోపాల్ జీ ఈ గొడుగులను టీటీడీ చైర్మన్ బీ. ఆర్. నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లకు అందజేశారు. శ్రీవారికి వరుసగా 21వ ఏడుగా ఈ గొడుగులను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్