తిరుపతి: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

1176చూసినవారు
తిరుపతి: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గోశాల ఎదురుగా రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు స్థానికుడై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న తిరుపతి జీఆర్పీ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తిరుపతి జీఆర్పీ రైల్వే సీఐ 9247575618 లేదా ఎస్సై 9247575619 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్