శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్కులోని ఎర్ర మెడగల మగ వాలబీ అనారోగ్య కారణంతో గురువారం అర్ధరాత్రి మృతిచెందినట్లు జూపార్కు క్యూరేటర్ సి. సెల్వం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు మరో ఆడ వాలబీని గుజరాత్కు చెందిన రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆగస్టు 27న జూపార్కుకు అందజేసింది. అనారోగ్యంతో ఆహారం తీసుకోకపోవడంతో జూపార్కు వైద్యులు ఐసీయూలో నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారని, అయినా పరిస్థితి మెరుగుపడలేదని ఆయన వెల్లడించారు. ఎస్వీ వెటర్నటీ వర్సిటీ పాథాలజీ విభాగం వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించి నరాల్లో రక్తం గడ్డ కట్టిన కారణంగా మృతిచెందినట్లు వెల్లడించారన్నారు. అనంతరం కలేబరాన్ని జూపార్క్ లోని పోస్టుమార్టం కాంప్లెక్స్ లో ఖననం చేశారు.