తిరుపతి: ఇటుక రాయి తలపై పడి మహిళ మృతి

1508చూసినవారు
తిరుపతి: ఇటుక రాయి తలపై పడి మహిళ మృతి
తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన వలస కూలీ అంజలి (45) పని చేస్తుండగా, ఇటుక రాయి ఆమె తలపై పడటంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త అంకాల్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్