తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఉద్యోగులే నిందితులతో కలిసి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి సరఫరాలోనే కాకుండా ఇతర వస్తువుల సరఫరాలోనూ ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీకి సరఫరా అయ్యే ప్రతి వస్తువు నాణ్యతను తనిఖీ చేసేందుకు కమిటీలు, ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.