నాయుడుపేటలో అర్బన్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును గురువారం సీజ్ చేశారు. నెల్లూరు నుంచి బెంగళూరుకు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆపి తనిఖీ చేయగా సరైన పత్రాలు లేవని గుర్తించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకుని ప్రయాణికులను మధ్యలోనే దింపేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.