తిరుపతి టీటీడీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

2చూసినవారు
తిరుపతి టీటీడీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
తిరుపతి టీటీడీ పరిపాలన భవనం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. సుమారు 30 ఏళ్లున్న ఈ వ్యక్తి చెక్స్ షర్ట్, వాకింగ్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి ఈస్ట్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్