తిరుపతిలోని ఉప్పరపల్లిలో ఓ వ్యక్తిపై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి భార్య వీడియో విడుదల చేశారు. తనకు, తన భర్తకు మధ్య గొడవలున్నాయని, వాటిని పరిష్కరించుకోవడానికి హరి ప్రసాద్ రెడ్డితో కలిసి వెళుతుండగా తన భర్త దాడి చేశారని ఆమె తెలిపారు. హరిపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, రాజకీయాల కోసం తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.