తిరుపతి జిల్లా జనసేన పార్టీకి కొత్త అధ్యక్షుడిని త్వరలోనే నియమించనున్నట్లు సమాచారం. హస్తకళల అభివృద్ధి ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, ఎమ్మెల్యే అరణి తమ వర్గీయులకు పదవి దక్కేలా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వీరు పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారని సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.