స్విమ్స్ కార్మికులు తమ శానిటేషన్ హోదాను రద్దు చేసి, వార్డు బాయ్స్‌గా గుర్తించి, తక్షణమే జీతాలు పెంచాలని కోరుతూ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేస్తున్నారు. సంవత్సరం క్రితం ఇచ్చిన హామీని అమలు చేయాలని 62 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులు, యాజమాన్యం స్పందన కోసం డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.