వృద్ధుల ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడిన దుండగులు

4చూసినవారు
వృద్ధుల ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడిన దుండగులు
తిరుపతి జిల్లా వెంకటగిరి ఏపీటీఎఫ్ కాలనీలో వృద్ధులైన బోడ సుబ్బరాయుడు, సుజాతమ్మ దంపతుల ఇంట్లోకి దుండగులు చొరబడి తలుపులు పగలగొట్టి 12 గ్రాముల బంగారు గొలుసు, 1,700 నగదును దొంగిలించారు. గతంలోనూ ఇదే ఇంట్లో దొంగతనం జరిగిందని, జాతర సమయంలో మళ్లీ ఇలా జరగడంపై దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర నేపథ్యంలో పట్టణంలో దొంగల ముఠా సంచరిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్