సైదాపురంలో అనారోగ్యంతో నాగరాజు మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్తను కోల్పోయిన భార్య, దూరమైన కొడుకుతో పాటు అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు అంధకారమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం కన్నీళ్లు ఇంకిపోయిన దీనస్థితి వర్ణణాతీతం. పిల్లలను ఎలా పెంచాలో తెలియక తల్లి మూగగా రోదిస్తోంది. ఈ విషాద దృశ్యం గుండెల్ని మెలిపెడుతోంది.