
మాదిగల రాజకీయ అవగాహన సదస్సు: రాపూరులో 10న భారీ బహిరంగ సభ
రాపూరు మండలంలోని వీరాయపాలెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందు రంగయ్య మాదిగ మాట్లాడుతూ, నవంబర్ 10న రాపూరు పట్టణంలో జరిగే మాదిగల రాజకీయ అవగాహన సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో రాపూరు మండలంలోని వందలాది మంది మాదిగలు పాల్గొనాలని కోరారు. అనంతరం గ్రామ కమిటీని ప్రకటించారు. చెర్లోపల్లి, జోరేపల్లి, గిలకపాడు గ్రామాల్లో కూడా ఎమ్మార్పీఎస్ కమిటీలు పూర్తి చేసినట్లు తెలిపారు.




































