AP: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ కుమార్ ఒడిశాకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆయనపైనా, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పైనా బాధితురాలు అప్పట్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. దాంతో ఆమె టీసీ తీసుకుని ఒడిశా వెళ్లిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.