టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'భగవంతుడు'. పల్నాడు నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌లోని విజువల్స్, తిరువీర్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జీజీ విహారి దర్శకత్వంలో, రవి పనస నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.