AP: రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉంటే తలసరి ఆదాయం,అగ్రికల్చర్ జీఎస్టీ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.